దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా దీవించుమీ గృహము
దేవపుత్రుల మంచి స్థావరంబుగ వెలసి సత్యకాంతుల బరుప ||దీవించు||
1. నీవే యీ గృహమునకు నిత్యతలపతివంచు నేవేళ నీ మనసు నెరిగి
జీవింపగ ||దీవించు||
2. సంభాషణలవేళ సన్నిహితుడా నీకు సంబరంబును గూర్చు సద్వా
క్కులను బలుక ||దీవించు||
3. భోజన సమయమున భూరి ప్రేమతో నిన్ను పూజ్యుండౌ యతిధిగ
పూజసల్పుచు బిలువ ||దీవించు||
4. ఇరుగుపొరుగులనెల్ల పరవారివలెగాక పరమాత్మనీసుతుల వలె జూచి
ప్రేమింప ||దీవించు||
5. అనుదిన ప్రార్థన లందు శ్రద్దాభక్తు లను జూపి క్రైస్తవ యనుభవంబుల
నొంద ||దీవించు||
6. క్రైస్తవగృహ విధులే గృహమున నెరవేర విస్తారమగు కృపను వీర
లందరి కొసగి ||దీవించు||
7. ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈ యూర వీరు నీకింపగు
సాక్ష్యము నియ్య ||దీవించు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దీవించు దేవా నీ బిడ్డలను దీవించు Lyrics
Your favourites
- No Favourites found!
