దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా
స్థావర జంగమ సహిత నిఖిల జగ దావన పావన భావ నిరంతర ||దేవా||
1.
సార కారుణ్యపారా వారా సర్వజ్ఞ నిర్వి కారా యేసు
నామావతారా దీన జనోపకారా ఘోరమైన సంసారటవిఁ
బడి దారిఁ గనని ననుఁ జేరఁబిలిచితివి ||దేవా||
2.
అక్షీణ విభవానంద మోక్ష రాజ్య మహిమాధ్యక్ష సంతత
సుజన రక్షా కపట దుర్మనుజ శిక్షా పక్ష విపక్ష విలక్షణ రహిత
కటాక్షము నాదెస దీక్షను నిలుపవె ||దేవా||
3.
సుందరాశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు
సజ్జన వంద్యా ఖందిత కలుష బృందా మంద మతిని నా
దెందము కడుఁదెలి వొందఁ జేసి నీ యందు నిలుపఁ గదె ||దేవా|
4.
నీవు నన్ను సృష్టించి నావు నా గురురాడ్దేవుఁ డవు క్రీస్తు యేసుని
చావు వలన నన్మనిపి నావు పావన జనక సుతాత్మలతోడను
గేవల మొక్కఁడ వై వెలిఁగెడి ప్రభు ||దేవా||
5.
ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి
సోమ సర్వేశ పరమ ధామ నేమ మెఱుంగని నీచుఁడ
నధముఁడ నోమహాత్మ దయతో మన్నింపవె ||దేవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన Lyrics
Your favourites
- No Favourites found!
