Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా, మా గృహంబును సదయుండవై దీవించుటకు Telugu Christian Song Lyrics

దేవా, మా గృహంబును సదయుండవై దీవించుటకు Lyrics

దేవా, మా గృహంబును సదయుండవై దీవించుటకు రారమ్ము నీవె
యిద్దానిని నెఱదాతవగుచు స ద్భావముతో నిచ్చితివి బహుమానముగ
మాకు ||దేవా||

1. మా యింటి యజమానుండ వీవెసుమ్మి మా యింటి ప్రభుఁడ వీవె
పాయక మా యింట భవదీయాభీష్టంబె శ్రేయోదాయకమగుచు సిద్ధిం
చెడును గాక ||దేవా||

2. మా యాస్తిపాస్తులన్ని మా కబ్బె భవ దీయానుగ్రహ బలముచే
నీయాననవ్వాని నీ యలఘ సేవకై న్యాయముగ నర్పింప నీయవె ఘన
బుద్ధి ||దేవా||

3. నీవిచ్చు ధననిధులైన మా బిడ్డలు కేవలము నీ దాసులై భావివానిరి
మణుల ఠేవనుద్భాసిల్ల నీవెవారిని భృశము ప్రోవుమాయువొసంగి ||దేవా||

4. రేపుమాపీ గృహునఁ బ్రోక్తములగుచు దీవించు ప్రార్థనముల
లోపరహితంబులుగా ధూపధూమములట్లు నీ పాదయుగళి స మీపింప
నిమ్మెపుడు ||దేవా||

5. ఏ రోగమును నెపుడేని మా మందిరపు ద్వారంబు చొరనీయక
ఆరోగ్యభాగధే యంబిచ్చి మమ్ములను భూరికృపబ్దివై పోసింపుమను
దినము ||దేవా||

6. ఇరుగుపొరుగు వారలతో సమాధాన పరతవసింపను నేర్పి కొఱగాని
కలహములు త్వరపెట్ట నవ్వాని భరియింపఁదగు సహాన భావంబు మా
కిమ్ము ||దేవా||

7. బీదసాదల కెల్లరకు మా గృహమెప్పు డాదరణాస్పదమై యుండ నీ
దానాసారంబు నెఱవర్షించిన కొలఁది నౌదార్యగుణము మా యందుఁ
బెంచుము సొరిది ||దేవా||

8. నక్కలకు బొరియలుండు దివి పక్షులకుఁ జక్కని గూళ్లునమరు
నొక్కింత యిక్కనా కెక్కడలేదనిన చక్కని నరసుతమా సదనంబు నకు
రమ్ము ||దేవా||

Your favourites

  • No Favourites found!