Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా! నీ కృప నిరంతరం మారనిదెపుడు Telugu Christian Song Lyrics

దేవా! నీ కృప నిరంతరం మారనిదెపుడు Lyrics

దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా
నిత్యజీవము గలది ప్రియ ప్రభువా .....
దేవా! నీ కృప నిరంతరం


1. పాపినగు నన్ను ఓ ప్రభువా - పరిశుద్ధపరచెను నీ కృపయే -2
పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలిచితివే -2 ॥ దేవా ॥


2. రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే -2
నిత్యము నీతో నుండుటకు - నిత్య జీవము నిచ్చితివే -2 ॥ దేవా ॥


3. విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే -2
శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే -2 ॥ దేవా ॥


4. కృపలో నడుపుము ఓ దేవా - కృపతో నింపుము నా ప్రభువా -2
నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తినిమ్ము -2 ॥ దేవా ॥

Your favourites

  • No Favourites found!