Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా నీ సాక్షిగా నేనుండుటఈ మంటికి Telugu Christian Song Lyrics

దేవా నీ సాక్షిగా నేనుండుటఈ మంటికి Lyrics

దేవా నీ సాక్షిగా నేనుండుట
ఈ మంటికి భాగ్యము (2)
జాలిగా మానుజాళికై
కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు
నా తుది శ్వాస ఆగే వరకు ||దేవా||
నాలాంటి నర మాత్రుని చేరుట
నీ వంటి పరిశుద్ధునికేలనో (2)
ఏ మేధావికి విధితమే కాదిది
కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే
నా బ్రతుకంత కొనియాడుట ||దేవా||
నా ఊహకందని మేలుతో
నా గుండె నిండింది ప్రేమతో (2)
నా కన్నీటిని మార్చి పన్నీరుగా
నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము
నేను ఎలుగెత్తి ప్రకటించెద ||దేవా||

Your favourites

  • No Favourites found!