Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ Telugu Christian Song Lyrics

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ Lyrics

దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ మంతుడగు యెహోవా సంస్తుతి
చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా జీవమా యెహోవా
దేవుని పావన నామము నుతించుమా నా యంతరంగములో వసించు
నో సమస్తమా ||దేవ||

1.
జీవమా, యెహోవా నీకుఁ జేసిన మేళ్లన్ మరవకు నీవు చేసిన
పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండఁ జేయును ఆ
కారణముచే ||దేవ||

2.
చావు గోతినుండి నిన్ను లేవనెత్తి దయను గృపను జీవ కిరీటముగ
వేయును నీ శిరసుమీద జీవ కిరీటముగ వేయును ఆ కారణముచే ||దేవ||

3.
యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనె క్రొత్త యౌవనంబై
వెలయునట్లుగా మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా ఆ
కారణముచే ||దేవ||

4.
ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయ మిచ్చున్ విభుండు
మార్గము తెలిపె, మోషేకుఁ దన కార్యములను విప్పె నిశ్రా
యేలు జనమునకు ఆ కారణముచే ||దేవ||

5.
అత్యధిక ప్రేమ స్వరూపియైన ధీర్ఘ శాంతపరుండు నిత్యము
వ్యాజ్యంబు చేయఁడు ఆ కృపోన్నతుఁడు నీ పయి నెపుడు కోప ముం
చఁడు ఆ కారణముచే ||దేవ||

6.
పామరుల మని ప్రత్యుపకార ప్రతి ఫలంబుల్ పంపలేదు భూమి
కన్న నాకసంబున్న యెత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున
ఆ కారణముచే ||దేవ||

7.
పడమటికిఁ దూర్పెంత యెడమో పాపములకును మనకు నంత
యెడము కలుగజేసియున్నాఁడు మన పాపములను ఎడముగానే
చేసియున్నాఁడు ఆ కారణముచే ||దేవ||

8.
కొడుకులపైఁ దండ్రి జాలి పడు విధముగా భక్తిపరుల యెడల జాలి
పడును దేవుండు తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు ఆ
కారణముచే ||దేవ||

9.
మనము నిర్మితమయిన రీతి తనకుఁ దెలిసియున్న సంగతి మనము
మంటి వారమంచును జ్ఞాపకముచేసి కొనుచు కఱుణ జూపుచుండును
ఆ కారణముచే ||దేవ||

10.
పూసి గాలి వీవ నెగిరి పోయి బసను దెలియని వన వాస పుష్పము
వలెనె నరుఁడుండు నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప
మెండు ఆ కారణముచే ||దేవ||

11.
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ భక్తితోఁ గైకొను జనులకు నిరతమును
గృప నిలిచి యుండును యెహోవా నీతి తరములు పిల్లలకు నుండును
ఆ కారణముచే ||దేవ||

Your favourites

  • No Favourites found!