దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావె
నా భాగ్యమా యేసువా ||దేవా||
1. యేసూ! నీదు ప్రేమను నే వింటిని భాసురంబగు నీ సిలువ నే గంటిని
యేసువాడను నే నంటిని ||దేవా||
2. ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్
పావనా జూపుము మార్గము ||దేవా||
3. నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే
నావికా రమ్ము నన్ బ్రోవుము ||దేవా||
4. స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి నీ
సత్య సువార్త నే జాటుదున్ ||దేవా||
5. రాజా! నీదు రాజ్యములో జేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము
రక్షణానందము గూర్చుము ||దేవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర Lyrics
Your favourites
- No Favourites found!
