Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా నా దేవుడవు నీవే వేకువనే Telugu Christian Song Lyrics

దేవా నా దేవుడవు నీవే వేకువనే Lyrics

దేవా నా దేవుడవు నీవే - వేకువనే నిన్ను వెదకుదును
1. నీ ప్రభావ బలమును చూడ - నీ పరిశుద్ధాలయమందు
నే నెంతో ఆశ తోడ - నీ వైపు కాచియున్నాను
2. నీళ్లు లేక యెండిన చోట - నా ప్రాణము నీ కొరకు
దాహము గొని యున్నది - నీ మీద ఆశచేత
3. నిను చూడ నా శరీరం - కృశించి పోవుచున్నది
నీ కృప జీవముకంటె శ్రేష్ఠం - నా పెదవులు నిన్ను స్తుతించున్
4. నా పడక మీద నిను దలచి - రాత్రి జాములో ధ్యానించునపుడు
క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లు - నా ప్రాణము తృప్తి నొందుచున్నది
5. ఉత్సాహముతో నా నోరు - నిన్నుగూర్చి పాడుచున్నది
నా జీవిత కాలమంత - ఈలాగున నిన్ను స్తుతియించెదన్
6. నా సహాయుడా నీ పేరు - బట్టి నా చేతు లెత్తెదను
నీ చాటున శరణు జొచ్చి - ఉత్సాహధ్వని చేసెదను
7. నను చంప వెదకెడి వారు - పాతాళమునకు పోయెదరు
ఖడ్గంబునకు గురియై - మరి నక్కలపాలగుదురు
8. దేవుని బట్టి రాజానందించున్ - తన తోడు ప్రమాణము చేయు
ప్రతివాడు అతిశయించును - మూయబడు నబద్ధికుల నోరు


Your favourites

  • No Favourites found!