Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా నీ గొప్పకార్యములన్ Telugu Christian Song Lyrics

దేవా నీ గొప్పకార్యములన్ Lyrics


దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం
నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం
హల్లెలూయా నా యేసురాజ
హల్లెలూయా నా ప్రాణనాథ (2)
స్తుతులు మహిమ ఘనత నీకే (2)      ||దేవా నీ||

శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
పరమును వీడి భువికరుదెంచి
కలువరి సిలువలో రక్తము కార్చి
నీదు కృపతో నను రక్షించిన
నీ దివ్య ప్రేమను అత్యధికముగా
స్మరింతున్ జీవిత కాలమంతా          ||దేవా నీ||

నీ కంటిపాపగా నన్ను కాచి
నీ చేతి నీడలో నన్ను దాచి
నీ అరచేతిలో నను చెక్కుకొని
నీదు సొత్తుగా నను చేసుకొని
అక్షయమైన నీ మధుర ప్రేమను
దీక్షతో ఇలలో చాటెదను                 ||దేవా నీ||

Your favourites

  • No Favourites found!