Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా! నీ తలంపులు నా కెంతో Telugu Christian Song Lyrics

దేవా! నీ తలంపులు నా కెంతో Lyrics

దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము
వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది
1. పాతాళపు పాశములు - నన్ను అరికట్టగా
ఆవరించె మరణ ఉరులు
క్రుంగిపోతినో దేవా - క్రుంగిపోతినో దేవా
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద - కీర్తించెద
2. నా మీదికి లేచువారు - నన్ను బెదరించెడు వారు
దేవ్వ నీ రక్షణ నా నుండి
దాటిపోయెననె వారు - దాటిపోయెననె వారు
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద - కీర్తించెద
3. నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటిని
పాపినై యుండి పాపమెరుగనంటి
శాపగ్రస్తుడనైతి దేవా - శాపగ్రస్తుడనైతి దేవా
ప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వని
అందుకే నే పాడెద - కీర్తించెద
4. మూతవేసిన నా మూర్ఖతయును - దాగియుండిన నా పాపమును
విప్పిచూపి శిక్షింపనంటివి
కక్షలేని నా దేవా - కక్షలేని నా దేవా
అర్హతలేనివాడను - సర్వము పోయినవాడను
అందుకే నే పాడెద - కీర్తించెద
5. నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లును
శ్రమపొంది యుండుట నాకు
మేలని నేర్పించితివి - మేలని నేర్పించితివి
నీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము - దినమెల్ల నేను
ధ్యానింతును అందుకే నే పాడెద - కీర్తించెద
6. పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమై
ఒట్టుపెట్టుకొని నేను చెప్పెద
విడచిపోదు నిన్ నాదు కృప - విడచిపోదు నిన్ నాదు కృప
నీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్తధ్వనులు
నా హృదయ ధ్యానం - అంగీకరించు దేవా - కీర్తించెద
7. నేను చేయునది ఇపుడు - నీవు ఎరుగజాలవనె
తెలిసికొందువు నీవు ఇక ముందుకు
నా పరిపూర్ణ మార్గమిదే - నా పరిపూర్ణ మార్గమిదే
వింటిని నే నీ స్వరము - కంటిని నే నీ రూపము
హల్లెలూయ పాడెద - కీర్తించెద


Your favourites

  • No Favourites found!