Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల Telugu Christian Song Lyrics

దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల Lyrics

దేవాది దేవా ప్రభువుల ప్రభూ
రాజుల రాజా హల్లెలూయ
1. నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించి
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి - పరలోక పాటన్ నా కొసగితివి
2. జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయము నిచ్చి
జయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న
3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
అరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి
4. మరణ పాత్రులం యిద్ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి
5. శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండా
నీ దయ నాపై నిండార నింపి - ఓదార్చి నన్ను నీ దారినడుపు
6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారము జల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్
7. పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తిగల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతము పాడ - జేర్చితివి నన్ నీ జనమునందు


Your favourites

  • No Favourites found!