Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ జీవితము Telugu Christian Song Lyrics

దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ జీవితము Lyrics

దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ జీవితము యా పురము
||దేవ||

1. దేవుని పురము దేదీప్య కరము జీవ మందిరము జేగీయ గృహము
||దేవ||

2. పరిశుద్ధ పురము పరమార్థ కరము పరమ మందిరము పరదైసు
పురము ||దేవ||

3. ఆనంద పురము ఆది నిరంతరము కాన దుస్తరము ఘన మనోహరము
||దేవ||

4. శృంగార పురము సుర చిర కరము బంగారు మెరము ప్రభల
భాసురము ||దేవ||

5. వైభవ పురము వంద్య మప్పురము సౌభాగ్య కరము స్ఫటిక మందిరము
||దేవ||

6. కెంపు పాండురము కీర్తి బంధురము ఇంపౌ నగరము ఇదియే
సుస్థిరము ||దేవ||

7. క్షుదలేని పురము సుక్షేమ కరము ముదము విస్తరము రొదలు
దుస్తరము ||దేవ||

8. ఆశ్చర్య పురము ఆశ్రయ కరము నిశ్చయపరము నిజదేవ పురము
||దేవ||

9. మాణిక్య పురము మణుల గోపురము వీణెలు స్వరము విన మనోహరము
||దేవ||

10. సూర్యభాసురము చొరనట్టి పురము కార్య మబ్బురముఁ గావించు
గరము ||దేవ||

11. సీయోను పురము శ్రేయస్సాగరము మాయ విధురము మరి
సంపత్కరము ||దేవ||

12. ఇచ్చు నిబ్బరము యెరుషలేం పురము మెచ్చౌ నబ్బురము మెరయు
మా పురము ||దేవ||

Your favourites

  • No Favourites found!