Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన Telugu Christian Song Lyrics

దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన Lyrics

దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని
నడుపుమా ||దేవర||

1. పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ
||దేవర||

2. యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున
నిలువుమ ||దేవర||

3. అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ
||దేవర||

4. పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున
గావుమ ||దేవర||

5. అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను
గొలుతుము దేవ ||దేవర||

6. నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము
||దేవర||

7. క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ
||దేవర||

Your favourites

  • No Favourites found!