పల్లవి:
దేవర నీ దీవెనలు - ధారళముగను వీరలపై
బాగుగ వేగమే దిగనిమ్ము - పావన యేసుని ద్వారగను
1.
దంపతులు దండిగ - నీ ధాత్రిలొ వెలయుచు సంపదలన్
సొంపుగ నింపుగ పెంపగుచు - సహింపున వీరు సుఖించుటకై
...దేవర...
2.
ఈ కవను నీ కరుణన్ - ఆఖరు వరకును లోకములో
శోకము లేకయె యేకముగా - బ్రాకటముగను జేకొనుము
...దేవర...
3.
ఇప్పగిది నెప్పుడును - గొప్పగు ప్రేమచే నొప్పుస
దా - మొప్పిన చొప్పున దప్పకను - మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్
...దేవర...
4.
తాపములు పాపములు - మొపుగ వీరిపై రాకుండగా -
వుగ - బ్రాపుగ దాపునుండి - యపదలన్నియు బాపుచును
...దేవర...
5.
సాధులుగన్ చేయుటకై శోధనలచె నీవు శోధింపగా
గదలక వదలక ముదమున నీ - పాదము దాపున బాదుకొనన్
...దేవర...
6.
మెండుగ భూ మండలపు - గుండములలో వీరుండగను
దండ్రిగ దండిగ నండనుండి - వెండియు వానిని ఖండింపన్
...దేవర...
7.
ఇద్దర వీరిద్దరును - శుద్దులై నిన్ను సేవించుటకై
శ్రద్దతో బుద్ధిగ సిద్ధపడన్ - దిద్దుము నీ ప్రియ బిడ్డలుగన్
...దేవర...
8.
వాసగ నీ దాసులము - చేసిన యీ మొఱల్ దీసికొని
మా సకలేశ్వర నీ సుతుడౌ - యేసుని పేరిట బ్రోవు మామెన్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవర నీ దీవెనలు ధారళముగను Lyrics
Your favourites
- No Favourites found!
