దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము
పావన యేసుని ద్వారగను ||దేవర||
1. దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ
నింపుగ పెంపగుచు స హింపున వీరు సుఖించుటకై ||దేవర||
2. ఈ కవను నీ కరుణన్ ఆకరువరకును లోకములో శోకము లేకయె
యేకముగాఁ బ్రాకటముగను జేకొనుము ||దేవర||
3. ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పునఁ
దప్పకను మెప్పుగ బ్రతుకగఁ బంపు కృపన్ ||దేవర||
4. తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగాఁ గాపుగఁ బ్రాపుగ
దాపునుండి యాపద లన్నియుఁ బాపుచును ||దేవర||
5. సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగాఁ కదలక వదలక
ముదమున నీ పాదము దాపునఁ బాదుకొనన్ ||దేవర||
6. మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ
నండనుండి వెండియు వానిని ఖండించవే ||దేవర||
7. ఇద్దర వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిద్ధ
పడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ ||దేవర||
8. వాసిగ నీ దాసులము చేసిన యీ మొఱల్ దీసికొని మా సకలేశ్వర నీ
సుతుఁడౌ యేసుని పేరిటఁ బ్రోవు మామేన్ ||దేవర||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవర నీ దేవెనలు ధారళముగను వీరలపై Lyrics
Your favourites
- No Favourites found!
