Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే Telugu Christian Song Lyrics

దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే Lyrics


దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే
నీ బదులేమో మానవా
ధనము కోరుతావా ఆ. . ఆ. .
ఘనము కోరుతావా ఆ. . ఆ. .
అల్పకాల పాపభోగములను కోరుతావా

1. జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి
అజ్ఞానిగా మిగిలాడు సొలమోను ఆనాడు
బలమును పొందాడు బలవంతుడయ్యాడు
బలహీనతలో పడి పోయాడు సమ్సోను
జ్ఞానులు బలవంతులు బంధీలై పోగా
బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో
ప్రభు కృపను కోరుతావో. .

2. మన రక్షణ కోరాడు మనకై ఏతెంచాడు
మనస్ధానమందు నిలచి మరణించె మనప్రభువు
ఆత్మలను అడిగాడు హతసాక్షి అయ్యాడు
అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు
యేసువైపు చూస్తు నీవు పయనమౌతావో
ఆ దేవుని దయను కోరి ధన్యుడౌతావో
మరి ఏమి కోరతావో. .

Your favourites

  • No Favourites found!