Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపదలోఅను Telugu Christian Song Lyrics

దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపదలోఅను Lyrics

దేవుడే మనకాశ్రయమును
దుర్గమునై యున్నాడు - ఆపదలో
అను కావున భూమి - మార్పు నొందినను
కొండలు మున్గినను - ఆపదలో ఆపదలో
1. సముద్ర జలములు - ఘోషంచుచు - నురుగు కట్టినను
ఆ పొంగుకు పర్వతములు కదలినను - మనము - భయపడము
2. ఒక నది కలదు - దాని కాలువలు - దేవుని పట్టణమును
సర్వోన్నతుని - మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి
3. దేవుడా పట్టణములో - నున్నాడు దానికి - చలనము లేదు
అరుణో - దయమున దానికి సహాయము చేయుచున్నాడు
4. జనములు ఘోషించు - చున్నవి రాజ్యములు కదలు చున్నవి
ఆయన కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది
5. సైన్యములధిపతి - యెహోవా మనకు తోడైయున్నాడు
యాకోబు దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు
6. యెహోవా చేసిన - కార్యములను వచ్చి చూడండి
అగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే
7. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి
అగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను


Your favourites

  • No Favourites found!