దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు(3)
1. ఏదేనులో ఆదాముతో నుండెన్ హానోకుతోడ నేగెను
దీర్ఘ దర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
2. దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ నబ్రాహాము కన్న
కొమరుని ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు ||తోడుగ||
3. యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయపుడు ||తోడుగ||
4. ఫరోరాజు తరిమిన యపుడు ఎర్రసంద్రపు తీరమున
యోర్దానునది దాటినపుడు ఎరికో కూలినయపుడు ||తోడుగ||
5. దావీదు సింహాము నెదరించి ధైర్యాన చీల్చిన యపుడు
గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరుమబడి నపుడు ||తోడుగ||
6. సింహపుబోనులో దానియేలు షద్రకు మేషాకబెద్నెగో
అగ్ని గుండములో వేయబడున్ నల్గురుగా కనబడినపుడు ||తోడుగ||
7. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలోనున్నప్పుడు
అపోస్తలుల విశ్వాసులు హింసింపబడిన యపుడు ||తోడుగ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు Lyrics
Your favourites
- No Favourites found!
