దేవుడు మీకు ఎల్లప్పుడు
తోడుగనున్నడు ... (3)
1. ఏదేనులో ఆదాముతో నుండెన్
హానోకు తోడనేగెను దీర్ఘ దర్శకులతో నుండెన్
ధన్యులు దేవుని గలవారు - తోడుగనున్నడు
2. దైవాజ్ఞను శిరసావాహించి దివ్యముగ నా బ్రాహాము
కన్న కొమరుని ఖండించుటకు
ఖడ్గము నెత్తిన యపుడు - తోడుగనున్నడు
3. యోసేపు ద్వేశించ బడినపుడు
గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెఱసాలయందు
సింహాసన మెక్కినయపుడు - తోడుగనున్నడు
4. ఎర్ర సముద్రపు తీరమునందు ఫరోతరిమిన దినమందు
యోర్దాను దాటిన దినమందు
యెరికో కూలిన దినమందు - తోడుగనున్నడు
5. దావీదు సింహము నెదిరించి ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినయపుడు
సౌలుచే తరుమబడినపుడు - తోడుగనున్నడు
6. సింహపు బోనులో దానియేలు షద్రకు మేషా కబేద్నెగో
అగ్ని గుండములో వేబడెన్
నల్గురిగా కనబడినపుడు - తోడుగనున్నడు
7. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నప్పుడు
అపోస్తలులు విశ్వాసులు
హింసించ బడినయపుడు - తోడుగనున్నడు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నడు ... Lyrics
Your favourites
- No Favourites found!
