దేవుఁడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము మ హా వినోదుఁ
డాపదల స హాయుఁడై నన్ బ్రోచును అభయ మభయ మభయ
మెప్పు డానంద మానంద మానంద మౌఁగ ||దేవుఁడే||
1. పర్వతముల కదిలిన నీ యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు
నీ సంద్ర ముప్పొంగినన్ అభయ మభయ మభయ ||దేవుఁడే||
2. దేవుఁ డెప్డు తోడుగాఁగ దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు
మిగుల ధన్యులై వసింతురు అభయ మభయ మభయ ||దేవుఁడే||
3. రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా
వైరిఁ బూని సంహరించును అభయ మభయ మభయ ||దేవుఁడే||
4. విల్లు విఱచు నాయన తెగ బల్లెము నఱకు నాయన చెల్లచెదర జేసి
రిపుల నెల్లఁద్రుంచు నాయనే అభయ మభయ మభయ ||దేవుఁడే||
5. పిశాచి పూర్ణబలము నాతోఁ బెనుఁగులాడ జడియును నశించి
శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును అభయ మభయ మభయ
||దేవుఁడే||
6. కోటయు నాశ్రయమునై యా కోబు దేవుఁ డుండఁగ ఏటి కింక వెరవ
వలయు నెప్డు నాకుఁ బండుగ యభయ మభయ మభయ ||దేవుఁడే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవుఁడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము Lyrics
Your favourites
- No Favourites found!
