Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని గొప్ప మహిమను Telugu Christian Song Lyrics

దేవుని గొప్ప మహిమను Lyrics

 

దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా?

ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2)

ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న

వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో  మన్నా (2)

 

మరచినవా నీ అపజయములు

గుర్తు లేదా! ఆ శోధనలు

నీవు చూపిన ఆ వినయములు

ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు

తండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణము

అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2) ॥ఎంత॥

 

అందుకొంటివి బాప్తిస్మమును

పొందు కొంటివి ఆ రక్షణను

వదలబోకు ఆత్మీయతను

చేరనివ్వకు నిర్లక్ష్యమును

తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు

నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? (2) ॥ఎంత॥

Your favourites

  • No Favourites found!