Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని గ్రంధము దినదినము చదువుము పావనమార్గము Telugu Christian Song Lyrics

దేవుని గ్రంధము దినదినము చదువుము పావనమార్గము Lyrics

దేవుని గ్రంధము దినదినము చదువుము పావనమార్గము జీవము
సత్యము ||దేవుని||

1. ఎంచి తలంచుము మించిన గ్రంథము అంచితముగను రెం డంచుల
ఖడ్గము ||దేవుని||

2. తేనియమధురము తినుము ప్రతిదినము ధ్యానముసేయుము దానన
బ్రదుకుము ||దేవుని||

3. నాధుని వాక్యము అరయుము భాగ్యము పాదపు దీపము భక్తుల
కవచము ||దేవుని||

4. ఆత్మల శాంతము అభయము శ్రేయము ఆత్మలకు బలము అనయము
సౌఖ్యము ||దేవుని||

5. పాపము శాపము పలువిధతాపము పాపును వేగము దాపున
జేరుము ||దేవుని||

6. మదినిది నిరతము పదిలము చేయుము సదమల జ్ఞానము సవిధము
మోక్షము ||దేవుని||

Your favourites

  • No Favourites found!