Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని కీర్తించెదము దైవపుత్రుని నామమందు యోసేపుపై Telugu Christian Song Lyrics

దేవుని కీర్తించెదము దైవపుత్రుని నామమందు యోసేపుపై Lyrics

దేవుని కీర్తించెదము - దైవపుత్రుని నామమందు
1. యోసేపుపై దృష్టినుంచి మోసపు చెరనుండి గాచి
యేసునం దైగుప్తు నుండి క్రీస్తునందరిని గాచిన
2. పాప ఋణముచెత నిత్య కోపమునకు గురియైతిమి
శాపగ్రాహియై శ్రీ యేసు పాప ఋణమును తీర్చినాడు
3. మార్గ సత్య జీవమై నిత్య మరణ భయము లేనివాడు
మరణ బంధితులను గావ మరణమొంది లేచినాడు
4. నీతిమంతుడైన యేసు నీతి కార్యములను జేసి
నీతి నిలయుండై తండ్రి నిల నీతితోనే తృప్తిపరచెన్
5. యేడ్చెను మన పాపములకై కార్చెను తనరక్తము నిల
ఓర్చెను తన శత్రువులను గెల్చెను తన సిలువతోనే
6. లేదు నీకు భయము చింత లేదు నమ్మి నిలచినతో
నీదు స్వాస్థ్యమంత తిరిగి నాథుడేసులో పొందగలవు
7. జయము పాడు ప్రియుడ లేచి జయ జీవితము నొంది వేగ
జయశీలుండు కీస్తు యేసుని జయము పాడు హల్లెలూయ


Your favourites

  • No Favourites found!