Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని నీతి ప్రతాపంభువి యేసుని సిల్వ Telugu Christian Song Lyrics

దేవుని నీతి ప్రతాపంభువి యేసుని సిల్వ Lyrics


1. దేవుని నీతి ప్రతాపం
భువి యేసుని సిల్వ ప్రభావం
దేవుల దేవుని అపురూపం
భువి యేసుని నామ స్వరూపం
దేవ యెహోవ సువాక్యం
-సౌభాగ్యం
దైవ జనుల హృదయానందం.
||యేసుక్రీస్తు దైవ సుతుండు
యేసుక్రీస్తు మనుజసుతుండు
యేసుక్రీస్తు దేవుండు
యేసే ప్రభువు
-స్తుతిపాత్రుడు||

2. ఆద్యంత రహిత కీర్తి
అవతార శ్రమార్జన మూర్తి
ఆకస రాసుల ఆదిపతి
అవనీ సృజనాత్మ ప్రతీతి
అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత
అనుదిన కృపాలిడు సుఖదాత.

3. పాపము భయపడు నామం
పాపాత్ముడు కృపగను హోమం
పతితుల వెదకిన ప్రేమస్వరం
పరలోక సుఖాల విహారం
పాప క్షమాపణ గానం - బహు
అనవరతము నిజబలిదానం. [మానం

4. జనముల జీవాధిపతి
జగమంతటి నేలెడిజ్యోతి
జీవుల అంతిమ న్యాయపతి
జీవాత్ములు క్రోలెడి నీతి
జనన మరణ జయశీల - నరపాల
జగతిని మార్చెడి శుభజ్వాల.

Your favourites

  • No Favourites found!