దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం దెలియరే కేవలము
నమ్ముకొనినఁ పరలోక జీవంబు మన కబ్బును ||దేవుని||
1. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతోఁ జేసెను
సర్వోపకారుడుండే మన మీద జాలిపరుఁడై యుండెను ||దేవుని||
2. మానవుల రక్షింపను దేవుండు తన కుమారునిఁ బంపెను మన
శరీరముఁ దాల్చెను ఆ ప్రభువు మన పాపమునకు దూరుఁడే ||దేవుని||
3. యేసుక్రీస్తను పేరున రక్షకుఁడు వెలసి నాఁడిలలోపల దోసకారి జనులతో
నెంతోను భాషలను బల్కినాఁడు ||దేవుని||
4. పాపభారంబు తోడ నే ప్రొద్దు ప్రయాసములఁ బొందెడి పాపులందఱు
నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
5. సతులైన పురుషులైనన్ యా కర్త సర్వ జనుల యెడలను సత్ప్రేమగ
నడిచెను పరలోక సద్బోధలిక జేసెను ||దేవుని||
6. చావు నొందిన కొందఱిన్ యేసుండు చక్కఁగా బ్రతికించెను సకల
వ్యాధుల రోగులు ప్రభు నంటి స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
7. గాలి సంద్రపు పొంగులన్ సద్దణపి నీళ్లపై నడచినాఁడే మేలు గల
యద్భుతములు ఈలాగు వేలకొలఁదిగ జేసెను ||దేవుని||
8. చేతుల కాళ్లను రా రాజు చేర మేకులు బొందెను పాతకులు
గొట్టినారే పరిశుద్ధ నీతి తా మోర్వలేకన్ ||దేవుని||
9. ఒడలు రక్తము గారఁగ దెబ్బలు చెడుగు లందఱుఁ గొట్టిరి వడిముళ్లు
తలమీఁదను బెట్టిరి ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
10. ఇన్ని బాధలు బెట్టుచుఁ దనుఁ జంపు చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని యేసుండు సన్నుతితో వేఁడెను ||దేవుని||
11. రక్షకుడు శ్రమఁ బొందఁగా దేశంబు తక్షణము చీఁక టయ్యెన్
రక్షకుఁడు మృతి నొందఁగఁ తెర చినిఁగి రాతి కొండలు పగిలెను ||దేవుని||
12. రాతి సమాధిలోను రక్షకుని నీతిగల దేహంబును పాఁతి పెట్టిరి
భక్తులు నమ్మిన నాతు లందఱుఁ జూడఁగా ||దేవుని||
13. మూఁడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాఁడు నాఁడు
నమ్మిన మనుజులు చూచిరి నలువది దినములందున్ ||దేవుని||
14. పదునొకండు మారులు వారలకుఁ బ్రత్యక్షుఁ డాయె నేను పర
లోకమున కేగెను తన వార్తఁ బ్రకటించు మని పల్కెను ||దేవుని||
15. నమ్మి బాప్తిస్మమొందు నరులకు రక్షణ మరి కల్గును నమ్మ నొల్లక
పోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను ||దేవుని||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవుని ప్రేమ యిదిగో జనులార భావంబునం Lyrics
Your favourites
- No Favourites found!
