Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని స్తుతియించి ఆరాధింతుము Telugu Christian Song Lyrics

దేవుని స్తుతియించి ఆరాధింతుము Lyrics


దేవుని స్తుతియించి ఆరాధింతుము
మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2)
రండీ ఓ జనులారా
సర్వలోక నివాసులారా (2)
సంతోషగీతము పాడెదము (2)
ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2)         ||దేవుని||

వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును
భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2)
ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2)
ఆయనే రక్షించును          ||రండీ ఓ||

బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను
నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2)
శత్రువుల చెర నుంచి విడిపించెను (2)
తోడుండి నడిపించెను         ||రండీ ఓ||

మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును
కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2)
వేదనలు శోధనలు ఎదిరించగా (2)
శక్తిని మనకిచ్చునూ        ||రండీ ఓ||

కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును
భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2)
ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2)
దిగులే మనకెందుకు     ||రండీ ఓ||

Your favourites

  • No Favourites found!