Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున Telugu Christian Song Lyrics

దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున Lyrics

దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్
అను కీడు మనలను చేరకను - కోటి
కీడుల నుండి కాపాడినట్టి - మహా
1. కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము
కష్టములబాపి మనల నింక
జగమున జీవితులుగ నుంచినట్టి - మహా
2. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగా
నిరతము కాచి చక్కగను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి
3. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగ
నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి
4. వత్సరారంభమున నిను మేమొక్కటిగా నారాధింప
దైవకుమారా కృపనిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి - మహా
5. భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి
6. ప్రతి సంవత్సరమును మము జూడుము
దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునపుడు నీ సన్నిధిని - చూపి
ధైర్యము నిచ్చి ఓదార్చుమయ్యా - మహా
7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ
నెట్టి యాపద లేక బ్రోవు మామెన్ - ప్రభు

Your favourites

  • No Favourites found!