Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి Telugu Christian Song Lyrics

దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి Lyrics

దేవుని స్తుతియించుడి! ఎల్లప్పుడు
దేవుని స్తుతియించుడి ఆ .. ఆ ..
1. ఆయన పరిశుద్ధ ఆలయమందు - ఆయన సన్నిదిలో
ఆ .. ఆ .. ఆయన సన్నిధిలో - ఎల్లప్పుడు
2. ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు
ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు

3. ఆయన పరాక్రమ కార్యముల బట్టి - ఆయన ప్రభావమును
ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు

4. బూర ధ్వనితో ఆయనను స్తుతియించుడి - స్వరమండలములతో
ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు

5. సన్న తంతుల సితారతోను - చక్కని స్వరములతో
ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు

6. తంబురతోను నాట్యముతోను - తంతి వాద్యములతోను
ఆ..ఆ.. తంతి వాద్యములతోను - ఎల్లప్పుడు

7. పిల్లన గ్రోవుల చల్లగ నూది - ఎల్ల ప్రజలు జేరి
ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు

8. మ్రోగు తాళములతో ఆయనన్ స్తుతియించుడి - గంభీర తాళములతో
ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు

9. సకల ప్రాణులెహోవాను స్తుతించుడి - హల్లెలుయా ఆమెన్
ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు


Your favourites

  • No Favourites found!