Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని వారసులం ప్రేమ నివాసులము Telugu Christian Song Lyrics

దేవుని వారసులం ప్రేమ నివాసులము Lyrics

పల్లవి: దేవుని వారసులం - ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
హల్లెలూయ - నవ యుగ సైనికులం - పరలోక పౌరులము
1. దారుణ హింస లలో - దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో - సర్వత్ర యేసుని కీర్తింతుము
2. పరిశుద్దాత్మునికై - ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై - సర్వాంగ హోమము జేయుదము
3. అనుదిన కూటములు - అందరి గృహములలో
ఆనందముతోను - ఆరాధనలాయే
వీనుల వినదగు పాటలతో - ధ్యానము చేయుచు మరియుదము

Your favourites

  • No Favourites found!