Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని వారసులం ప్రేమ నివాసులముజీవన యాత్రికులం Telugu Christian Song Lyrics

దేవుని వారసులం ప్రేమ నివాసులముజీవన యాత్రికులం Lyrics

దేవుని వారసులం ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ
సైనికులం పరలోకపౌరులము హల్లెలూయ నవయుగ

1. దారుణ హింసలలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలో ఆగని జయములతో మారని ప్రేమ
సమర్పణతో సర్వత్ర యేసును కీర్తింతము ||దే||

2. పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము
పరమాత్ముని రాక బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును
జూపుటకై సర్వాంగహోమము జేయుదము ||దే||

3. అనుదిన కూటములు అందరి గృహములలో
ఆనందముతోను ఆరాధనలాయో వీనులవిందగు పాటలతో
ధ్యానము చేయుచు మరియుదుము ||దే||

4. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ
ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము ||దే||

5. గోధుమ గింజవలె క్రీస్తుడు చావగను
నాధుని మరణములో శాశ్వత జీవమును నిధులుగ పండించి
లేవగను మాధుర్య రక్షణ లభియించెను ||దే||

6. హతసాక్షుల కాలం అవనిలో చెలరేగ
గతకాలపు సేవ గొల్గొత గిరి భీతులలో బహురీతులలో
నూతన లోకము కాంక్షింతుము ||దే||

7. ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగ
విభు మహిమను గాంచ విశ్వమే మముగోర శుభములు
గూర్చుచు మాలోన శోభిల్లుయేసును జూపుదము ||దే||

Your favourites

  • No Favourites found!