Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుని యందు నిరీక్షణనుంచి ఆయనను Telugu Christian Song Lyrics

దేవుని యందు నిరీక్షణనుంచి ఆయనను Lyrics

పల్లవి:
దేవుని యందు నిరీక్షణనుంచి - ఆయనను స్తుతించు నా ప్రాణమా

1.
ఏ అపాయము రాకుండ నిన్ను - దివారాత్రులు కాపాడువాడు (2X)

ప్రతిక్షణం నీపక్షముండు - రక్షకుడు
...దేవుని...

2.
చీకటిని వెలుగుగా చేసి - ఆయనే నీముందు పోవువాడు (2X)

సత్యమగు - జీవమగు - మార్గ - మేసె
...దేవుని...

3.
తల్లి తన బిడ్డను మరచినను - మరువడు నీ దేవుడు నిన్ను (2X)

తల్లి కన్నా - తండ్రి కన్నా - ఉత్తముడు
...దేవుని...

4.
నీకు సహాయము చేయువాడు - సదా ఆదుకొనువాడు ఆయనే (2X)

ఆధారము - ఆదరణ - ఆయనలో
...దేవుని...

5.
నీకు విరోధముగా రుపించిన - ఏవిధ ఆయుధమును వర్ధిల్లదు (2X)

శత్రువులు - మిత్రులుగా - మారెదరు
...దేవుని...

6.
పర్వతములు తొలగిపోయినను - తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2X)

కనికర - సంపన్నుడు - నాదేవుడు
...దేవుని...

7.
స్తుతి మహిమలు నీకే ప్రభు - నిత్యము నిన్నే కొనియాడెద (2X)

హల్లేలూయ - హల్లేలూయ - హల్లేలూయ
...దేవుని...

Your favourites

  • No Favourites found!