Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వునికే మహిమ Telugu Christian Song Lyrics

వునికే మహిమ Lyrics


దేవునికే మహిమ (2)
యుగయుగములు కలుగును గాక (2)       ||దేవునికే||

దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2)
దానికి మనలను వారసుల జేసెను (2)
వందనములు చెల్లింతుము (2)       ||దేవునికే||

నిలవరమైనది మనకిల లేదని (2)
వల్లభుడు స్థిరపరచెను పరమందు (2)
చెల్లించి స్తుతులను పూజింతుము (2)       ||దేవునికే||

సీయోను పురమగు దేవుని నగరుకు (2)
సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2)
స్తోత్ర గీతములను పాడెదము (2)       ||దేవునికే||

శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2)
ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2)
ముదమారగను ప్రణుతింతుము (2)       ||దేవునికే||

Your favourites

  • No Favourites found!