దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
1. యెరుషలేము యెహోవాయే కట్టుచున్నవాడని(2)
ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవుని||
2. గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవుని||
3. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును
వాటి కన్నియు పేరులు పెట్టిచున్నవాడని ||దేవుని||
4. ప్రభువు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడని ||దేవుని||
5. దీనులకు అండాయనే భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి ||దేవుని||
6. ఆయన ఆకాశమున్ మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము సిద్ధపర్చువాడని ||దేవుని||
7. పర్వతములలో గడ్డిని పశువులకు మొలపించెను
అరచు పిల్లకాకులకును ఆహారము తానీయును ||దేవుని||
8. గుర్రముల నరులదలి బలము నానందించుడు
కృప వేడు వారిలో సంతసించువాడని ||దేవుని||
9. యెరుషలేము యెహోవాను సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని ||దేవుని||
10. పిల్లల నాశీర్వదించియు బలపరచు నీగుమ్మముల్
మంచి గోధుమపంటతో నిన్ను తృప్తిగనుంచును ||దేవుని||
11. భూమికి తన యాజ్ఞన ఇచ్చువాడు ఆయనే
వేగముగను దేవుని వాక్యము పరుగెత్తును ||దేవుని||
12. వాక్యమును యాకోబుకు తెలియచేసినవాడని
ఏ జనయు కీలాగున చేసి యుండ లేదని ||దేవుని||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదిమనమందరము Lyrics
Your favourites
- No Favourites found!
