Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది Telugu Christian Song Lyrics

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది Lyrics

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
1. యెరూషలేము నెహోవాయే - కట్టుచున్న వాడని
ఇశ్రాయేలీయులను - పోగుచేయువాడని
2. గుండె చెదరిన వారిని - బాగుచేయు వాడని
వారి గాయములన్నియు - కట్టుచున్న వాడని
3. నక్షత్రముల సంఖ్యను - ఆయన నియమించెను
వాటికన్నియు పేరులు - పెట్టుచున్న వాడని
4. ప్రభువు గొప్పవాడును - అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని
5. దీనులకు అండాయనే - భక్తిహీనుల గూల్చును
సితారతో దేవుని - స్తుతులతో కీర్తించుడి
6. ఆయన ఆకాశము - మేఘములతో కప్పుచు
భూమి కొరకు వర్షము - సిద్ధపరచు వాడని
7. పర్వతములలో గడ్డిని - పశువులకు మొలిపుంచును
అరచుపిల్ల కాకులకును - ఆహారము తానీయును
8. గుర్రముల నరులందరి - బలము నానందించడు
కృపకు వేడువారిలో - సంతసించు వాడని
9. యెరూషలేమా యెహోవాను - సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము - ఆనందించు వాడని
10. పిల్లల నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో - నిన్ను తృప్తిగ నుంచును
11. భూమికి తన యాజ్ఞను - యిచ్చుపాడు ఆయనే
వేగముగను దేవుని - వాక్యము పరుగెత్తును
12. వాక్యమును యాకోబుకు - తెలియజేసిన వాడని
ఏ జనము కీలాగున - చేసియుండ లేదని


Your favourites

  • No Favourites found!