Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును Telugu Christian Song Lyrics

ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును Lyrics

ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను
నిరత ముండెడి ధనమును ||ధరణి||

1. యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని
వేగము దివ్య వరముగ నమ్మికన్ ||ధరణి||

2. విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న
నీకుఁ గల్గు వేద నాధికంబుపో ||ధరణి||

3. పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ
మిచ్చిన పరమధాముని నమ్ముమీ ||ధరణి||

4. తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు
ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు ||ధరణి||

5. దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు
మిత్ర నేట నెచట వెదకినన్ ||ధరణి||

Your favourites

  • No Favourites found!