Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే Telugu Christian Song Lyrics

ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే Lyrics

ధ్యానింప నే చిత్తమా వర్షాంతమున ధ్యానింపనే చిత్తమా ధ్యానించ
వాసక్తి జ్ఞానంబుఁ గలిగించు జ్ఞాన స్వరూపుఁడు జ్ఞానాత్మచే నీకు
||ధ్యానింపవే||

1. అరయ నీ తలఁపుల నఘము లగుపడు నీకుఁ పరిశుద్ధుఁ డీక్షింప
బహుగా గనుపడుచుండు ||ధ్యానింపవే||

2. పరికింపఁ బలుకులఁ పాప మగుపడు నీకు పరిశుద్ధుఁ డరయుఁ గ
న్పడకుండు నే యది ||ధ్యానింపవే||

3. క్రియలను జింతింప మయిల గనపడు గాన భయ మొంది నమ్మికను
బదవే క్రీస్తుని దరికి ||ధ్యానింపవే||

4. దేవుని ఘన ప్రేమ దినదినముఁ దలపోయ నీవు పొందఁగ వచ్చు
నిక్కమైన శుద్ధి ||ధ్యానింపవే||

5. స్మరియింప నీలోన వర రక్షకుని పాట్లు భరియింప నోపుదువె పాప
మొక నిమిషంబు ||ధ్యానింపవే||

6. హృదయంబు విమలాత్మ సదనంబుఁ గావింపఁ పదవే శ్రీఘ్రంబుగఁ
పరమ జనకుని కడకు ||ధ్యానింపవే||

7. దేవుని సేవింపఁ దిరముగ నాశించి దేవాత్మ కొర కీవు దినము
దేవుని వేఁడ ||ధ్యానింపవే||

Your favourites

  • No Favourites found!