Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి Telugu Christian Song Lyrics

దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి Lyrics

దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవఁజేతు నో ప్రభో
మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి
యాదరించు మక్కువైన దేవ తనయ ||దిక్కులేని||

1. ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలార రండటంచును
భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది
తుదిని నీ దరిఁ జేరితి నన్నాదరించుము ||దిక్కులేని||

2. బలము లేని వాఁడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని
ప్రభో ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలఁగ జేసి
యాత్మ కధిక బలము నొసగి మునుపు మయ్య ||దిక్కులేని||

3. పామరుండ నౌట వల్లను నే నెఱుఁగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను
కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు
విశ్వసించి ప్రేమను వర్తింపజేయు ||దిక్కులేని||

4. వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి సందియము లణంచు
మో ప్రభో సందియ మెడబాపి శాస్త్ర మందు నుండు సార వాక్యానంద
పదవు లనుభవింప డెందము వెలిఁగింప వయ్య ||దిక్కులేని||

Your favourites

  • No Favourites found!