దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడ
నెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు||
1. పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁ
గావు మమ్ముఁ గావు మమ్ము ||దినదినమునకు||
2. పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁ
బ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినమునకు||
3. కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతో
చూపుదువే చూపుదువే ||దినదినమునకు||
4. నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు కాలమందుఁ
దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినమునకు||
5. సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు
నిలిపితివే నిలిపితివే ||దినదినమునకు||
6. ఆసఁ గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై
బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము ||దినదినమునకు||
7. విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగఁ బంపించుమీ
శ్రేష్టముగను శ్రేష్ఠముగను ||దినదినమునకు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా Lyrics
Your favourites
- No Favourites found!
