Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ Telugu Christian Song Lyrics

దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ Lyrics

దినమెల్ల నే పాడినా కీర్తించినా
నీ ఋణము నే తీర్చగలనా
కొనియాడి పాడి నీ సాక్షిగానే
ఇలలో జీవించనా ||దినమెల్ల||
గాయపడిన సమయాన మంచి సమరయునిలా
నా గాయాలు కడిగిన దేవా
ఆకలైన వేళలో ఆహారమిచ్చి
నన్ను పోషించినావు దేవా (2)
నిను విడువనూ ఎడబాయననినా (2)
నా యేసయ్య ||దినమెల్ల||
నా బలహీనతయందు నా సిలువను మోస్తూ
నిన్ను పోలి నేను నడిచెదన్
వెనుకున్నవి మరచి ముందున్న వాటికై
సహనముతో పరుగెత్తెదన్ (2)
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2)
నేను పొందాలని ||దినమెల్ల||

Your favourites

  • No Favourites found!