Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె Telugu Christian Song Lyrics

దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె Lyrics

దినము గతియించెను దిననాధుఁడ పరాద్రి వెనుకడాఁగె నిఁ
కమా మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై ఘనుఁడ దేవా ||దినము||

1.
సరవినంబరవీధి సంజ కెంజాయలు మురువుఁజూపె ప్రభువా
దొరము నీ ముఖకాంతి కిరణ జాలము మాపై నెఱపరమ్ము ||దినము||

2.
కటికి చీఁకటులు దిక్తటములఁ గలిపియు త్కటములైన నీ చెం
గట నున్న నెట్టి సంకటమేని మమ్ముఁ దాఁకుటకు జంకు ||దినము||

3.
తలఁపువలనను నోటి పలుకువలనను జెనఁటి పనులవల్ల మేము
వలచి చేసిన పాపముల నెల్ల క్షమియింపుమ లఘక్షాంతి ||దినము||

4.
ముమ్మరమ్మగు శోధ నమ్ములపై విజయమ్మునొంద నీ దినమ్ము
మాకు సామర్ధ్యమొసఁగితివి వంద నమ్ము దేవ ||దినము||

5.
ఈ దినము మాకు సమ్మోదంబుతో నిచ్చి యాదుకొన్న వరమౌ
నీ దివ్యదానముల కై దేవ! మా కృతజ్ఞతను గొమ్ము ||దినము||

6.
అలసిన మా దేహములకు వలసిన నిదురఁ గలుగఁజేసి నీదూ
తల హస్తములలో మమ్ములను దాఁచుము భద్రముగను దేవ ||దినము||

7.
అరుణోదయముననిన్నర్చించు కొఱకు నీ కరము సాఁచి మమ్ము
త్వరగా మేల్కొల్పుము స్వాస్థ్య ప్రదాతవై పరమదేవ ||దినము||

8.
దాత వీవె లోక త్రాత వీవె మాకు నేత వీవె యేసు నీతి
సూర్యుండవి ఖ్యాతి మహిమలు నీకె కలుగుఁగాక ||దినము||

Your favourites

  • No Favourites found!