Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దివినేలు స్తోత్రార్హుడా Telugu Christian Song Lyrics

దివినేలు స్తోత్రార్హుడా Lyrics


దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
మొదటివాడవు – కడపటివాడవు
యుగయుగములలో ఉన్నవాడవు (2)

మానక నా యెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ తరతరములకు (2)
మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు
నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఊటలు
నీ కృపలే బలమైన కోటలు (2)       ||దివినేలు||

దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)
దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు
దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్థిరమైన సంపద (2)       ||దివినేలు||

సీయోను శిఖరముపై నను నిలుపుటకే
జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)
దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు
సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు
నీ రాజ్యము పరిశుద్ధ నగరము
ఆ రాజ్యమే నిత్య సంతోషము (2)       ||దివినేలు||

Your favourites

  • No Favourites found!