1. దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గములయందు నిలిచియుండక
2. అపహసించునట్టి ప్రజలు కూర్చుండెడు
ఆ చోట కూర్చుండక యుండువాడే ధన్యుడు
3. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు
4. కాలువ నీటియోర నతడు నాటబడి
కాలమున ఫలించు చెట్టువలె యుండును
5. ఆకు వాడని చెట్టువలె నాతడుండును
ఆయన చేయునదియెల్ల సఫలమగును
6. దుష్టజనులు ఆ విధముగా నుండక
పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు
7. న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులు
నీతిమంతుల సభలో పాపులును నిలువరు
8. నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును
నడుపును దుష్టుల దారి నాశనమునకు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దుష్టుల ఆలోచన చొప్పున నడువకపాపుల మార్గములయందు Lyrics
Your favourites
- No Favourites found!
