Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి Telugu Christian Song Lyrics

ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి Lyrics

ఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా
ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2)
యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2)       ||ఏ చెట్టు||

పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను
గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను
నరుల పాపము తన భుజాలపై
మోపుకొనెను పరమ దేవుడు (2)
నమ్మిన వారై రక్షణ పొంద
స్వర్గానికే చేరుకుందమా (2)       ||ఏ చెట్టు||

మహిమ రూపుడే మనిషి జన్మలో – భువికి అవతరించెను
సిలువ మ్రానుపై వ్రేళాడెను – రక్తము చిందించెను
యేసు లేచెను మరణము గెలిచి
నమ్మిన వారిని పరమును చేర్చ (2)
హల్లెలూయా ఆనందమే
హల్లెలూయా సంతోషమే (2)       ||ఏ చెట్టు||

Your favourites

  • No Favourites found!