Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏ యోగ్యతా లేని నన్ను నీవు Telugu Christian Song Lyrics

ఏ యోగ్యతా లేని నన్ను నీవు Lyrics


ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా||
కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు (2)
పావన దేహంలో గాయాలు పొంది (2)
రక్తమంత చిందించినావా ||నీకేమి||
సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నాకీయుటకు (2)
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి (2)
నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి||
పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు (2)
నా స్థానమందు నా శిక్ష భరించి (2)
మరణించి తిరిగి లేచావా ||నీకేమి||

Your favourites

  • No Favourites found!