Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎడబాయని నీ కృప Telugu Christian Song Lyrics

ఎడబాయని నీ కృప Lyrics

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2)      ||ఎడబాయని||

శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2)      ||ఎడబాయని||

విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2)      ||ఎడబాయని||

నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగా (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2)      ||ఎడబాయని||

Your favourites

  • No Favourites found!