Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎడబాయని నీదు కృప  విడనాడని Telugu Christian Song Lyrics

ఎడబాయని నీదు కృప విడనాడని Lyrics

ఎడబాయని నీదు కృప – విడనాడని నీ ప్రేమ (2)
నన్నెంతగానో బలపరచెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)
నన్ను బలపరచెను – నన్ను వెంబడించెను
నన్నెంతగానో స్థిరపరచెను (2)||ఎడబాయని||
1.కన్నీటి లోయలలో నుండి
నన్ను దాటించిన దేవా
సింహాల బోనులలో నుండి
నన్ను విడిపించిన ప్రభువా (2) ||నన్ను బలపరచెను||
2.నేనున్నతమైన స్థితిలో
ఉండాలని ఆశించితివా
ఏ అర్హత నాకు లేకున్నా
నా కృప నీకు చాలునంటివే (2) ||నన్ను బలపరచెను||
3.నేనెదుర్కొనలేని పరిస్థితులు
నా ఎదుట ఉన్నవి దేవా
నీ శక్తిని నేను కోరెదను
నన్ను విడిపించు నా దేవా (2) ||నన్ను బలపరచెను||

Your favourites

  • No Favourites found!