Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏదేను తోటలో... ఆదాము హవ్వలు ప్రతి Telugu Christian Song Lyrics

ఏదేను తోటలో... ఆదాము హవ్వలు ప్రతి Lyrics


ఏదేను తోటలో... ఆదాము హవ్వలు - ప్రతి చల్లపూట తన తండ్రితో... ఏ పాపమెరుగని స్థితిలో
ఆజ్ఞను అతిక్రమించి - అపవాది మాటను పాటించి - తప్పుచేశారు - తప్పు తండ్రిపై నెట్టివేశారు..
చెట్టు వేయుటే నేరమా...?! దేవుడు ముందుగా చెప్పకుండెనా...?!
తెలుసుకో దీని రహస్యం.. చెట్టులోనే ఉంది పరమార్ధం..


చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయనివాడు గొప్పవాడా...?
చెడు చేయడానికి అవకాశమేలేక చేయనివాడు గొప్పవాడా... ?
నీ గొప్పతనాన్ని నిరూపించుకో.. మంచిచెడులు యోచించి తెలుసుకో..
చెట్టు వేయుటే నేరమా...?! దేవుడు ముందుగా చెప్పకుండెనా...?!
తెలుసుకో దీని రహస్యం.. చెట్టులోనే ఉంది పరమార్ధం..


మంచివాడివని నిరూపించుటకు - పరీక్ష ఉండాలి
గొప్పవాడవని రుజువుచెయుటకు - చెట్టు వేయాలి
చెడు చేయకుండానే చెడును తెలుసుకో - దైవలక్షణముందని రుజువు చేసుకో..
చెట్టు ఉన్నా ఫలము తిననివాడే గొప్పవాడు - చెట్టు వేయకుంటే గొప్పతనానికే అర్ధంలేదుతెలుసుకో దీని రహస్యం.. చెట్టులోనే ఉంది పరమార్ధం..

Your favourites

  • No Favourites found!