Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఏది నా విశ్రాంతి యీ లోకమందు Telugu Christian Song Lyrics

ఏది నా విశ్రాంతి యీ లోకమందు Lyrics

ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ
మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున
చొరకున్న లేదు సుఖ మెచట ||నేది||

1. కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి
తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు
శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక ||నేది||

2. కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి
కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ
మొందెద వి చార మిఁక నేల ||నేది||

3. యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు
పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా
కన్నీళ్లు చింత లెడఁబాపి ||యేది||

4. ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు
బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ
దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు ||నేది||

5. నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల
పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని
పాడి చని పరమసుఖి నౌదు ||నేది||

Your favourites

  • No Favourites found!