ఎదో ఆశ నాలో – నీతోనే జీవించని
యేరై పారే ప్రేమ – నాలోనే ప్రవహించని
మితి లేని ప్రేమ చూపించినావు
శృతిచేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే
1. పరవాసినైన కడుపేధను
నాకేలా ఈ బాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము
నీవిచ్చు బహుమానము (2)
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్యా ||ఎదో||
2. నీ పాదసేవ నే చేయనా
నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే
ఘనమైన ప్రతిపాధన (2)
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తుంతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్యా ||ఎదో||
