Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై దేవుడే Telugu Christian Song Lyrics

ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై దేవుడే Lyrics

ఎదురు చూచెదము దృఢపునాదిగల పట్టణమునకై
దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు - మన ముల్లసించెదము
1. ఆ నగరములో ప్రభుమహానీయుడు - స్తుతులకు పాత్రుడుతానే
దేవుడా పట్టణమందున గలడు - కదలడు ఎన్నటికిన్
2. దృఢముగానున్న దేవుని నగరుకు - చుట్టు ప్రాకారము గలదు
తన సిమ్హాసనమందున గలడు - రాజాధి రాజాయనే
3. ప్రభు పట్టణమున నిత్యసంతోష - శాంతి విజయములు గలవు
నీతిమంతులు సదాస్తుతులు పాడెదరు - ప్రభువారితోడ నుండ
4. జయవంతు లందరు ఆ నగరమున - నిత్యము నివసించెదరు
భూమి పునాదులు వేయకమునుపే వారికై సిద్ధపరచెన్
5. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు
వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందుము


Your favourites

  • No Favourites found!